కనీస పెన్షన్‌ పెంచేది లేదు !

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వ రిటైర్ట్‌ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లకు కనీస పెన్షన్‌ మొత్తాన్ని పెంచే ఉద్దేశం లేదని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 9వేల రూపాయలు కనీస పెన్షన్‌గా అందుతున్నదని, దీనిని పెంచే ప్రతిపాదనేదీ తమ ముందు లేదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, '44,81,245 పెన్షనర్లు, 20,93,462 ఫ్యామిలీ పెన్షనర్లున్నారు. వీటిపై చేస్తున్న వ్యయం 2022-23లో రూ. 2,41,777 కోట్లకు చేరుకుంది. కనీస పెన్షన్‌ మొత్తాన్ని పెంచే ప్రతిపాదనేదీ లేదు' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)