ఫిడే వరల్డ్ కప్ చాంపియన్ గా కార్ల్‌సన్

Telugu Lo Computer
0


ఫిడే వరల్డ్ కప్ చాంపియన్‌గా మాగ్నస్ కార్ల్‌సన్ అవతరించాడు. నరాలు తెగే ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానందపై అతను గెలుపొందాడు. ఓడినా ప్రజ్ఞానంద తన ఆటతీరుతో అందరి మనసులను గెలుచుకున్నాడు. టై బ్రేక్‌లో చివరకు కార్ల్‌సన్ విజయం సాధించి కెరీర్‌లో మొదటి ఫిడే వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. అసమాన పోరాటంతో ఆకట్టుకున్న 18 ఏళ్ల ప్రజ్ఞానంద రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. సుమారు మూడు రోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో పోటీపోటీగా తలపడ్డారు కార్ల్‌సన్, ప్రజ్ఞానంద. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగియడంతో విజేతను నిర్ణయించే టై బ్రేక్ కీలకం అయింది. ఇటలీకి చెందిన గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరునమూడో స్థానంలో నిలిచాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)