పార్లమెంట్‌లో మణిపూర్ నిరసనలు మిన్నంటడంతో ఉభయ సభల కార్యకలాపాలు నిలిచిపోయాయి. జూలై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత ఎనిమిది రోజులుగా ముందుకు సాగడం లేదు. మణిపూర్ వ్యవహారంతో ఉభయసభలు అట్టుడుకుతున్నాయి. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయడంతోపాటు, దీనిపై దీర్ఘకాలిక చర్చ జరగాలని ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేయడంతో.. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్‌పై చర్చకు సిద్ధమని ప్రభుత్వం తెలిపినప్పటికీ.. మొండి వైఖరితో విపక్షాలు ఆందోళనలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించడంతో ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది.విపక్షాలకు సర్దిచెప్పేందుకు సభాపతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఇరుసభలూ వరుసగా వాయిదా పడుతున్నాయి. మణిపూర్‌తోపాటు అవిశ్వాసంపై వెంటనే చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానానికి బదులుగా మణిపూర్‌పై చర్చకు కేంద్రం సిద్ధమైంది. రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెబుతుండగా...ప్రతిపక్షం రూల్ 267 కింద చర్చకు పట్టుబట్టింది. చర్చకు ముందు ప్రధానమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఏకాభిప్రాయం కుదరకపోవడం, విపక్షాలు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో సభను వాయిదా వేశారు. https://t.me/offerbazaramzon
ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా !
August 01, 2023
0
Tags