సుంకాలను వెచ్చించని కారణంగా ఆంధ్రప్రదేశ్ కి కంపా నిధులు ఇవ్వలేదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కి 2020-21లో కాంపా (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీస్‌) నిధులు అటవీ భూముల మళ్లింపునకు పరిహారంగా వసూలు చేసిన సుంకాలను పూర్తిగా వినియోగించని కారణంగా బదిలీ చేయలేదని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే తెలిపారు. లోక్‌సభలో వైకాపా సభ్యులు ఎన్‌.రెడ్డెప్ప, గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. '2020-21కి సంబంధించి జాతీయ ప్రాధికార సంస్థ ఏపీకి రూ.330.82 కోట్ల మేర కంపా యాన్యువల్‌ ప్లాన్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ను ఆమోదించింది. అటవీ సంరక్షణ చట్టం-1980లోని నిబంధనల ప్రకారం మళ్లించిన అటవీ భూములకు పరిహారం కింద వసూలు చేసిన సుంకాల వినియోగాన్ని పూర్తిచేయనందున కంపా నిధులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి బదిలీ చేయలేదు. 2021-22కి సంబంధించి రూ.325 కోట్లు, 2022-23కు రూ.224.09 కోట్లకు వార్షిక కార్యకలాపాల ప్రణాళికకు కంపా ఆమోదముద్ర వేసింది' అని కేంద్రమంత్రి వెల్లడించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో రూ.84.66 కోట్లు ఏపీ ప్రభుత్వం వద్ద ఖర్చు కాకుండా ఉన్నట్లు కేంద్ర జల్‌ శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ కేఆర్‌ఎన్‌ రాజేశ్‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)