ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు ఇండిగో సిబ్బంది ఘన స్వాగతం !

Telugu Lo Computer
0


ఇండిగో విమానం ఎక్కిన ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు విమానం సిబ్బంది సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇస్రో చీఫ్‌కు వెల్‌కమ్‌ చెప్తూ ఫ్లైట్‌లో స్పెషల్‌ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. దేశం గర్వపడేలా చంద్రయాన్‌-3 మిషన్‌ సక్సెస్‌ చేసినందుకు ఆయనకు ఇండిగో సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎయిర్ హోస్టెస్‌ పూజా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ ప్రకటన వినగానే ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికులందరూ చప్పట్లతో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ను అభినందించారు. ఆయనను చూసేందుకు సీట్లలో నుంచి లేచారు. మరో ఎయిర్ హోస్టెస్‌ కూల్‌డ్రింక్స్‌, కొన్ని ఫుడ్‌ ఐటమ్స్‌ ఉన్న ట్రేతో వచ్చి ఆయనకు ఇండిగో ఎయిర్‌లైన్స్ తరపున ప్రశంసాపత్రం అందించింది. చిరునవ్వుతో ఆ నోట్‌ను సోమనాథ్‌  తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)