మిలిటరీ డ్రోన్‌ల తయారీలో భారతీయులు చైనాలో తయారైన విడిభాగాలను ఉపయోగించడంపై ప్రభుత్వం నిషేధించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా లోపాలపై తీవ్రమైన ఆందోళన తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్‌ల కమ్యూనికేషన్ విధులు, మానవరహిత వైమానిక వాహనాల కెమెరాలు, రేడియో ట్రాన్స్‌మిషన్, ఆపరేటింగ్ సాప్ట్‌వేర్‌లలో చైనా తయారు చేసిన విడిభాగాల ద్వారా నిఘా సమాచారం సేకరణకు అవకాశం ఉందని దేశ భద్రతాధిపతులు ఆందోళన చెందుతున్నారని నలుగురు రక్షణ, పరిశ్రమల అధికారులను వ్యాఖ్యలను నివేదిక పేర్కొంది. మరోవైపు.. భారతదేశం సైన్యంకు అవసరమయ్యే ఆయుధాలు, ఇతర అవసరాలను స్వదేశంలోనే తయారు చేసేందుకు ఎక్కువ అవకాశాన్ని కల్పించేలా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ తాజా నిషేధం ఇటీవల సంవత్సరాలలో భారత మార్కెట్ కోసం తీవ్రంగా పోటీపడుతున్న చైనీస్ డ్రోన్ తయారీదారులకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ప్రపంచంలో ప్రముఖ డ్రోన్ ల ఉత్పత్తిదారుగా చైనా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. చైనా నుంచి డ్రోన్ టెక్నాలజీని భారతదేశానికి ఎగుమతి చేస్తోంది. 2019లో అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ చైనాలో తయారైన డ్రోన్ లు, విడిభాగాల కొనుగోలు, వాడకాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, 2020లో తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణ తరువాత రెండు అణ్వాయుధ పొరుగు దేశాలైన భారత్, చైనా మధ్య సైనిక ఉధ్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి చైనాపై పలు విధాలుగా భారత్ ఆంక్షలు విధించుకుంటూ వస్తోంది.
మిలిటరీ డ్రోన్‌ల తయారీలో చైనా విడిభాగాల వాడకంపై నిషేధం !
August 08, 2023
0
Tags