మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలకు వివాదం లేవనెత్తిన విపక్షం !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని ధూలే జిల్లా, అంతుర్లీలో గిరిజన మత్స్యకారులకు చేపల వేట సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమంలో మత్స్యకారులను ఉద్దేశించి రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ విజయ్ కుమార్ గవిత్ ప్రసంగించారు. ''రోజూ చేపలు తినేవారి చర్మం నునుపుగా మారుతుంది. కళ్లు మెరిసిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే, వారిని మీరు ఆకర్షిస్తారు. ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పాలి. ఆమె మంగుళూరులోని బీచ్ సమీపంలో నివసించేది. ఆమె రోజూ చేపలు తినేది. మీరు ఆమె కళ్ళు చూశారా ? మీకు కూడా ఆమెలాంటి కళ్ళు ఉన్నాయి. చేపల్లో కొన్ని నూనెలు ఉంటాయి, అవి మీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది'' అని మంత్రి అన్నారు. ఈ ప్రకటనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గిరిజనుల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)