ఢిల్లీ మెట్రోలో వింత విన్యాసాలు !

Telugu Lo Computer
0


ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. రెడ్డిట్‌లో ఇందుకు సంబంధించిన వీడియో షేర్ అయింది. నల్లటి కళ్లద్దాలు ధరించి, తన మొబైల్ ఫోన్‌ను పట్టుకున్న ఒక వ్యక్తి పదేపదే వెనక్కు వంగడం వీడియోలో వుంది. సెల్ఫీ తీసుకుంటున్నట్లు నటిస్తూ, మెట్రోలో పిల్లర్ చుట్టూ తిరుగుతూ కనిపించాడు. మెట్రోలో ప్రయాణిస్తున్న వారు వ్యక్తి చేసిన వింత చర్యకు ఆశ్చర్యపోయారు. కొంత మంది అతని చేష్టలను సెల్ ఫోన్ల సహాయంతో వీడియో తీశారు. ఓ వ్యక్తి ఈ వీడియోను రెడ్డీట్ లో షేర్ చేసిన కొద్దిసేపటికే 2వేల మందికిపైగా వీక్షించారు. 200 మందికిపైగా తమదైన శైలిలో కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది  మెట్రోలో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించవద్దని ఇప్పటికే డీఎంఆర్‌సీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. మెట్రోలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. డీఎంఆర్సీ ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకొనే వారిపైపట్ల చర్యలు తీసుకొనేందుకు నిత్యం అందుబాటులో ఉంటారని డీఎంఆర్సీ తెలిపింది. అయితే, తాజాగా మెట్రోలో వింతగా ప్రవర్తించిన వ్యక్తి ఎవరు, ఎక్కడి వ్యక్తి అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)