గ్రీస్‌లోని ఏథెన్స్‌లో ప్రధాని మోడీకి శుక్రవారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు’ లభించింది. గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా ఎన్ సకెల్లారోపౌలౌ గ్రీస్‌లో ప్రధాని మోడీ అధికారిక పర్యటన సందర్భంగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్’ను ప్రదానం చేశారు. ఇది గ్రీస్ దేశంలో రెండో అత్యున్నత పురస్కారం. దీనిపై ప్రధాని మోడీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా సకెల్లారోపౌలౌ, అక్కడి ప్రభుత్వానికి, గ్రీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశం పట్ల గ్రీస్ ప్రజలకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు. గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. భేటీ అనంతరం మాట్లాడిని మోడీ..వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య, డిజిటల్ చెల్లింపులు, ఫార్మా, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్- గ్రీస్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామిగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. భారత ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సమావేశాలు ముగిసిన అనంతరం నేడు గ్రీస్‌కు వెళ్లారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానంపై మోదీ గ్రీస్ పర్యటనకు వెళ్లారు.
ప్రధాని మోడీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు !
August 25, 2023
0
Tags