ముగిసిన అమర్‌నాథ్ యాత్ర !

Telugu Lo Computer
0


రెండు నెలలపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ముగిసింది. ఈ ఏడాది 4.4 లక్షల మంది భక్తులు మంచుకొండల్లో ఉండే శివలింగాన్ని దర్శించుకున్నారు. 62 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో 48 మంది మరణించారని, 62 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వాతావరణ సంబంధిత, సాధారణ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. గతేడాది 3.65లక్షల మంది అమర్‌నాథ్‌ శివలింగాన్ని దర్శించుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.4లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది యాత్ర శాంతియుతంగా, ఎలాంటి ఆంటకాలు లేకుండా సాగిందని అధికారులు తెలిపారు. మహంత్‌ దీపేంద్ర గిరి నేతృత్వంలో సాధువులు, యాత్రికులు పెహల్గామ్‌ నుంచి 42కి.మీ దూరం నడిచి అమర్‌నాథ్‌కు చేరుకున్నారు. అనంతరం చివరి రోజు (గురువారం) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)