ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ప్రారంభం

Telugu Lo Computer
0


ర్బీఐ గవర్నర్ నాయకత్వంలో ఆరుగురు సభ్యుల అత్యున్నత స్థాయి ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. గురువారం ఆగస్టు 10వ తేదీన నిర్ణయాలు వెలవడనున్నాయి. ద్రవ్యోల్బణంపై నిశ్చిత పరిస్థితి లేనందున యథాతథ రెపోరేటు అంటే ప్రస్తుతం ఉన్న 6.5 శాతానికే నిర్ణయించుటకు అవకాశమున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇదే జరిగితే రెపో రేటు యథాతథ స్థితి కొనసాగుతుంది. ఇది వరుసగా మూడోసారి అవుతుంది. తీవ్ర ద్రవ్యోల్బణం నేపథ్యంలో గత సంవత్సరం మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగింది. ఈ సంగతి అందరికి తెలిసిందే. దీంతో ఈ రేటు 6.5 శాతం ఫిబ్రవరికి చేరింది. ఆ తర్వాత రేటు మార్పు నిర్ణయాలు తీసుకోలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)