వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. గ్యాస్ బండపై 200 రూపాయలు సబ్సిడీ ప్రకటించింది. ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి 400 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర 11 వందల రూపాయల వరకు ఉంది. మోడీ ప్రధాన మంత్రి కాక ముందే ఈ గ్యాస్ సిలిండర్ ధర 450 రూపాయలుగా ఉంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మూడింతలు పెరిగింది. దీనికితోడు నిత్యావసర సరుకుల ధరలు సైతం భారీగా పెరిగాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా దేశంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం 200 రూపాయలు తగ్గించి ఓటరును ప్రసన్నం చేసుకోనుంది. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల క్రమంలోనే.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాల్ తన ఎన్నికల హామీ కింద గ్యాస్ సిలిండర్ ధరపై 250 రూపాయల తగ్గింపు ప్రకటించారు. తగ్గించిన ధరను నేరుగా మహిళల ఖాతాలో వేస్తామని, ఇది రాఖీ పండుగకు గిఫ్ట్ అని ప్రకటించారు.
తగ్గిన వంట గ్యాస్ ధర !
August 29, 2023
0
Tags