అమృత్ భారత్ పథకం కింద దేశం లోని 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేసి మోడీ మాట్లాడుతూ "రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్, గేమింగ్ జోన్‌లు ఏర్పాటు చేయనున్నాం. అభివృద్ధి చేశాక, ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్‌గా మారతాయి. అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతోంది" అని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమృత్ భారత్ పథకం కింద తొలిదశలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణలో రూ. 894.09 కోట్లతో 21 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్ లో 453.50 కోట్లతో 18 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఏపీ లోని ఏలూరు రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. తెలంగాణలో ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, కరీం నగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, మలక్‌పేట, మల్కాజిగిరి, నిజామాబాద్, రామగుండం, తాండూరు, యాదాద్రి (రాయగిరి), జహీరాబాద్. ఆంధ్రప్రదేశ్‌లో పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల, కర్నూలు, కాకినాడ టౌన్, ఏలూరు, తుని, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ.
తెలుగు రాష్ట్రాల్లో 39 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన
August 06, 2023
0
Tags