రెండు ఏనుగుల్ని పట్టుకునేందుకు 33 లక్షలు ఖర్చు !

Telugu Lo Computer
0


రికంబన్ ఏనుగు ఎంత బీభత్సం సృష్టించిందో తెలిసిందే. కేరళ, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో అది తప్పించుకుని తిరిగింది. స్థానిక గ్రామాల ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. అయితే అరికంబన్‌తో పాటు ధోనీ ఏనుగులను పట్టుకునేందుకు కేరళ సర్కార్ 33 లక్షలు ఖర్చు చేసిందట. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద ప్రాపర్ ఛానల్ అనే గ్రూపు తెలుసుకున్నది. చిన్నకెనాల్ నుంచి పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు అరికంబన్‌ను తరలించేందుకు 15. 85 లక్షలు ఖర్చు చేశారు. అరికంబన్ కోసం బోను నిర్మించేందుకు 4 లక్షలు ఖర్చు అయినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. రేడియో కాలర్ కోసం 87 వేలు అయ్యింది. ఇక పీటీ7 (ధోనీ) ఏనుగు కోసం కూడా భారీగా ఖర్చు చేశారు. ధోనీని పట్టుకునేందుకు 17.32 లక్షలు ఖర్చు చేశారు. దీంట్లో బోను కోసం 2.74 లక్షలు ఖర్చు చేశారు. ఇక ఆ ఏనుగుకు మత్తు ఇచ్చేందుకు 2.44 లక్షలు చేశారు. జనవరి 22వ తేదీన పాలక్కాడ్ ప్రాంతంలో 75 మంది సభ్యుల టాస్‌ఫోర్స్ ధోనీని పట్టుకున్నది. ఏప్రిల్ 29వ తేదీన పెరియార్ అడవికి అరికంబన్‌ను ట్రాన్స్‌లొకేట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)