నో ఫ్లై లిస్ట్‌లో 166 మంది !

Telugu Lo Computer
0


2021లో ‘నో ఫ్లై లిస్ట్’ ప్రారంభమైనప్పటి నుండి ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్  ఇప్పటివరకు 166 మంది ప్రయాణికులను ఈ జాబితాలో చేర్చింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో సమాచారం అందించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం నిన్న పార్లమెంట్‌లో వెల్లడించింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ 2020లో ప్రయాణికులు చేసిన ఫిర్యాదుల సంఖ్య 4,786 అని వ్రాతపూర్వక సమాధానంలో రాజ్యసభకు తెలిపారు.. 2021లో 5,321, 2022లో 5,525, ఈ సంవత్సరం జనవరి నుండి 2,384గా తెలిసారు. 2014లో దేశంలో షెడ్యూల్డ్ ఆపరేటర్ల సముదాయంలో మొత్తం 395 విమానాలు ఉన్నాయని, 2023 నాటికి వాటి సంఖ్య 729కి పెరిగిందని ఆయన చెప్పారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 2300 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయి. 2021 సంవత్సరం నుండి నో ఫ్లై జాబితాను విడుదల చేసిన తర్వాత అన్ని ఫిర్యాదులను DGCA పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. DGCA నుండి అందిన సమాచారం ప్రకారం.. దేశంలోని ప్రధాన దేశీయ విమానయాన సంస్థల మొత్తం విమానాల పరిమాణం వచ్చే ఏడేళ్లలో దాదాపు 1,600 వరకు ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు ఉన్న డేటా ప్రకారం.. రద్దు చేయబడిన విమానాల నిష్పత్తి 0.58 శాతంగా ఉందని ఆయన చెప్పారు. బీజేపీ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ ప్రశ్నలకు వీకే సింగ్ సమాధానమిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)