పంజాబ్ లో పాక్ డ్రోన్ స్వాధీనం

Telugu Lo Computer
0


పంజాబ్ పోలీసులు అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మరో పాకిస్తాన్  డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్‌పై అజ్నాలా సబ్ డివిజన్‌లోని కక్కర్ గ్రామ సమీపంలో సరిహద్దు భద్రతా దళం  ఆదివారం కాల్పులు జరిపింది. నిర్ధిష్ట సమాచారంతో గాలించగా పాక్ డ్రోన్ కనిపించిందని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో గ్రామం ప్రక్కనే ఉన్న వ్యవసాయ క్షేత్రం నుంచి భద్రతా దళాలు డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దుల్లో తరచూ పాక్ డ్రోన్లు సంచరిస్తుండటం ఇటీవల పెరిగింది. పాక్ నుంచి డ్రగ్స్, ఆయుధాలను డ్రోన్ల ద్వారా భారతదేశంలోకి పంపిస్తున్నారని తేలింది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)