కాంగ్రెస్ అప్పుడు ఏడ్వాల్సింది - కానీ ఇప్పుడు ఏడుస్తుంది !

Telugu Lo Computer
0


ణిపూర్‌లో దాదాపు రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతుల మధ్య వైరం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో భాజపా నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు. 'క్రమంగా శాంతియుత పరిస్థితులు నెలకొంటున్న సమయంలో మణిపుర్ గురించి కాంగ్రెస్‌ కన్నీరు కారుస్తోంది. ఘర్షణలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో అది ఏడ్చి ఉండాల్సింది. అప్పుడు వారు రాష్ట్రంలో అడుగుపెట్టలేదు. దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణుగుతుంటే.. వారు దాని గురించి మాట్లాడుతున్నారు. నెల క్రితం ఉన్న పరిస్థితితో పోలిస్తే మణిపుర్ మెరుగ్గా కనిపిస్తోందని మీకు గ్యారంటీగా చెప్పగలను' అని హిమంత బిశ్వ శర్మ మీడియాతో అన్నారు. మణిపుర్‌ లో జరుగుతోన్న ఘర్షణలతో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల ప్రజలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వీరిని పరామర్శించేందుకు, పౌర సమాజం నేతలతో మాట్లాడేందుకు గురువారం రాహుల్‌ మణిపుర్‌ వచ్చారు. శుక్రవారమూ ఆయన పర్యటన కొనసాగింది. దీనిపై భాజపా నేతలు విమర్శలు గుప్పించారు. రాహుల్‌-బాధ్యత ఒకే దగ్గర ఉండవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)