రైతులతో సందడి చేసిన రాహుల్ గాంధీ !

Telugu Lo Computer
0

                                         

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు బయల్దేరిన రాహుల్ గాంధీ హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ ప్రాంతంలో రైతులు కనిపిస్తే కాసేపు సందడి చేశారు. భారత్ జోడో యాత్ర స్టైల్ టీషర్టు, చిన్నపాటి నిక్కరులో వ్యవసాయ పొలాలు కలియతిరిగారు. రైతులతో మాట్లాడుతూ, వ్యవసాయంలోని ఒడిదుడుకుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్రాక్టర్ ‭తో పొలం దున్నారు.  బరోడా, మదీనా గ్రామాల్లోని వ్యవసాయ పొలాలు తిరిగిన రాహుల్ అక్కడి రైతులతో సంభాషిస్తున్న, పొలం దున్నుతున్న, నాటు వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలు షేర్ చేసి ''హర్యానాలో రైతుల మధ్య రాహుల్ గాంధీ' అని ట్వీట్ చేశారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)