ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆర్థిక మోసాలకు పాల్పడిన కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ కు దుబాయ్ లో మూడు ఫ్లాట్లు ఉన్నాయని ఆరోపిస్తూ ఓ లేఖ విడుదల చేశారు. 2020లో హైదరాబాద్ లోని ఒక ఫార్మా కాంట్రాక్టర్ నుంచి కేజ్రీవాల్ కి ముడుపులు అందాయని ఆరోపించాడు. అంతే కాదు తానే ఈ ఫ్లాట్లు కొన్నానని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అయితే జుమైరా పామ్స్ లోని ఆ మూడు అపార్ట్మెంట్లను ఇప్పుడు అత్యవసరంగా అమ్మకానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ విషయం లో మీరు నిజం మాట్లాడరు కాబట్టి, నాకు, సత్యేందర్ జైన్ కు మధ్య జరిగిన మూడు పేజీల వాట్సాప్ చాట్లను విడుదల చేస్తాను అంటూ కేజ్రీవాల్ ను సుఖేష్ చంద్రశేఖర్ హెచ్చరించారు. వచ్చే ఏడు రోజుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, యాంటీ కరప్షన్ విజిలెన్స్ కు కూడా ఒక్కో కాపీని పంపుతాని సుఖేష్ తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని న్యాయ పాలనకు సంబంధించిన అంశాలను తరచూ లేవనెత్తే కేజ్రీవాల్, ఆయన భాగస్వాములు తనకు, తన కుటుంబానికి ముప్పు తెస్తున్నారని చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. కేజ్రీవాల్ దిగజారి సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని సుఖేష్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేజ్రీవాల్ ఇతరులను నిందించే ముందు తమనితాము చూసుకోవాలని సూచించాడు. త్వరలో కేజ్రీవాల్‌కూడా తీహార్ జైలులో చేరతారని సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు. https://t.me/offerbazaramzon
కేజ్రీవాల్ కు దుబాయ్ లో మూడు ఫ్లాట్లు ఉన్నాయి !
July 02, 2023
0
Tags