ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ ఓ వెలుగు వెలిగింది విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే భాషలో.. క్లిష్టమైన సబ్జెక్ట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చిన బైజూస్.. తక్కువ కాలంలోనే ఎంతో మంది ఆదరణ పొందింది.. కొన్ని విద్యాసంస్థల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒప్పందాలు చేసుకునే స్థాయికి ఎదిగింది.. అయితే, ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు నిలిచిపోవడం, బోర్డు నుంచి డైరెక్టర్లు వైదొలగడం,ఆ సంస్థ నుంచి ఆడిటర్ వెళ్లిపోవడం.. ఇలా ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. అంతేకాదు.. ఏప్రిల్ చివరల్లో బైజూస్ బెంగళూరు కార్యాలయాలపై దాడి చేసిన కొందరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత విలువైన విద్య-సాంకేతికత స్టార్టప్‌ను బహిరంగంగా విదేశీ మారకపు ఉల్లంఘనలతో ముడిపెట్టారు. ఇలా వరుసగా కష్టాల్లో చిక్కుకున్న రవీంద్రన్.. ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారట. ఈడీ దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత దుబాయ్‌లో పలువురు ఇన్వెస్టర్లతో మాట్లాడారు రవీంద్రన్.. 1 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ గురించి ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. కంపెనీని కాపాడుకునేందుకు కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తోంది.. ఆ సమావేశంలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని తమతో పంచుకున్నట్టు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. కాగా, రవీంద్రన్ కొన్ని నెలల తరబడి సంక్షోభంలో ఉన్నారు. భారతదేశంలో ఈడీ చేసిన దాడితో పాటు, ఆర్థిక ఖాతాలను సకాలంలో ఫైల్ చేయడంలో విఫలమైంది. అనేక US-ఆధారిత పెట్టుబడిదారులు బైజూస్ అర బిలియన్ డాలర్లను దాచిపెట్టారని ఆరోపణలు వచ్చాయి.. సంస్థ యొక్క తొలి పెట్టుబడిదారులలో ఒకరైన ప్రోసస్ ఎన్‌వి బోర్డు నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు చెప్పారు.. పేలవమైన ప్రదర్శనకు తోడు, డైరెక్టర్ల సలహాలను పట్టించుకోకపోవడం వల్లే బోర్డు నుంచి వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు. కేరళలోని మారుమూల గ్రామంలో జన్మించిన రవీంద్రన్.. మొదట్లో బెంగళూరులో విద్యార్థులకు ట్యూషన్లు బోధించేవారు. అతడి బోధనా పద్ధతులు విద్యార్థులను ఇట్టే ఆకట్టుకోవడంతో తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన ఆయన.. బైజూస్ ప్రస్థానాన్ని ప్రారంభించారు.. అయితే, టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఎంట్రీతో బైజూస్ కు మంచి ఆధరణ లభించింది.. మొదట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి.. ఇక, ప్రపంచాన్ని వణించిన కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో కొన్ని కంపెనీలను సైతం బైజూస్ కొనుగోలు చేసింది. కానీ, 2022 తర్వాత బైజూస్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఆన్‌లైన్ ట్యూషన్లకు ఆదరణ తగ్గడం.. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో.. కొన్ని కంపెనీలు పెట్టుబడులకు ముఖం చాటేశాయి. అక్కడి నుంచి ఆ సంస్థను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. స్టార్టప్ ఫండింగ్ దెబ్బతినడంతో గత సంవత్సరం అది మారిపోయింది, 2023 మొదటి సగం నాటికి నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది బైజూస్. https://t.me/offerbazaramzon
కన్నీటి పర్యంతమైన బైజూస్ సీఈవో రవీంద్రన్ !
July 26, 2023
0
Tags