బీహార్‌లోని నవాడలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని కొంతకాలంగా ఇష్టపడుతోంది. ఇదే క్రమంలో వారు దగ్గరయ్యారు. ఒక రోజు రాత్రి భర్త పని మీద బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ప్రియుడిని కలిసేందుకు అతడి ఇంటికి వెళ్లింది. వీరిని గమనించిన బంధువులు, స్థానికులు ఇద్దరిని కట్టేసి తీవ్రంగా కొట్టారు. గ్రామ పెద్దలు పచాయితీ చేసి ఇద్దరినీ ఊరి నుంచి బహిష్కరించేందుకు నిర్ణయించారు. ఇంతలో తిరిగి వచ్చిన భర్త.. ఇద్దరినీ తీసుకు వెళ్లి ఊరిలోని గుడిలో వివాహం జరిపించాడు. దీంతో స్థానికులంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే.. ఆమె ప్రియుడికి గతంలోనే వేరొక యువతితో వివాహం జరిగింది. అంతేకాకుండా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. https://t.me/offerbazaramzon
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త !
July 07, 2023
0
Tags