మహిళ ఎంపీపై శిండే వర్గం ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు !

Telugu Lo Computer
0


శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదిపై  శిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్‌ శిర్సత్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆదిత్య ఠాక్రే ఆమె అందాన్ని చూసే రాజ్యసభలో స్ధానం ఇచ్చారని సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ ' నేను ఎలా ఉన్నానో .. ఎక్కడ ఉన్నానో మీలాంటి వారు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. ఇవి మహిళల హుందాను దిగజార్చేలా ఉన్నాయి. వారి అభిప్రాయాలను గౌరవించండి 'అని ట్విట్‌ చేశారు. తర్వాత ఆదిత్య ఠాక్రే కూడా దీనిపై స్పందిస్తూ..'వక్రబుద్ధితో ఆలోచిస్తున్నారు. ఇలాంటి నీచమైన మనస్తత్వం గల వ్యక్తులు ఎలా రాజకీయాల్లో ఉన్నారో నాకు అర్థం కావడం లేదు' అని మండిపడ్డారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే గతంలో ప్రియాంక చతుర్వేది గురించి తనతో అన్న మాటలనే తాను ఇప్పుడు చెప్పానని సంజయ్ వివరణ ఇచ్చారు. ప్రియాంక చతుర్వేది 2019లో కాంగ్రెస్‌ను వీడి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేనలో చేరారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)