మణిపూర్‌లో రెండున్నర నెలల నుంచి జరుగుతున్న హింసాకాండపై పార్లమెంటులో సవివరంగా మాట్లాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల ఆగ్రహం వ్యక్తం చేయడం సరిపోదని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చి తప్పుడు ఆరోపణలు చేయడానికి బదులుగా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని అన్నారు. మెయిటీలు, కుకీల మధ్య మే 3 నుంచి ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడింది. దీనిపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ చెప్పారు. మే 18న పోలీసులకు ఫిర్యాదు అందిందని, దీనిపై జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారికి మరణ శిక్ష విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హుయిరెమ్ హెరోడస్ ఇంటిని దుండగులు గురువారం తగులబెట్టారు. పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు గుంపుగా వచ్చి, ఈ ఇంటిని తగులబెట్టారు. ఖర్గే శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ''పార్లమెంటులో గురువారం మీరు ప్రకటన చేయలేదు. మీకు కోపం వస్తే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో తప్పుడు పోలికలు తేకుండా, మొదట మీరు మీ మణిపూర్ ముఖ్యమంత్రిని డిస్మిస్ చేసి ఉండేవారు. కేవలం ఒక సంఘటన గురించి కాకుండా, పశ్చాత్తాపం లేకుండా, పూర్తి నిస్సహాయతతో చూస్తూ, కేంద్ర, రాష్ట్రాల్లోని మీ ప్రభుత్వాలు 80 రోజులపాటు నిర్వహించిన హింసపై మీరు పార్లమెంటులో వివరంగా మాట్లాడాలని ఇండియా ఆశిస్తోంది'' అని తెలిపారు. https://t.me/offerbazaramzon
మణిపూర్‌పై మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలి !
July 21, 2023
0
Tags