అహ్మదాబాద్‌లోని రాజస్థాన్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని షాయిబాగ్‌ ప్రాంతంలో ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నడుపుతున్న రాజస్థాన్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి బేస్‌మెంట్‌లో ఆదివారం ఉదయం మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పేషంట్స్‌ను కాపాడే ప్రయత్నం చేసింది ఆసుపత్రి యాజమాన్యం. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు వంద మందికిపైగా పేషంట్స్‌ను వేరు చోటకు షిఫ్ట్‌ చేసింది. ఆసుపత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొద్ది మంది పేషంట్స్‌ పరుగులు తీసినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. 25 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక, ప్రమాదం స్థానికంగా పేషంట్లను, ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అయితే, అగ్ని ‍ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)