విమానంలో చిన్నారి ఫస్ట్ బర్త్ డే వేడుకలు !

Telugu Lo Computer
0


ఓ చిన్నారి బర్త్ డే సంబంధించిన వీడియోను తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కూతురు బర్త్ డే ఇంత ఘనంగా జరిపినందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గాల్లో ఎగురుతున్న ఇండిగో విమానంలో సిబ్బంది ఓ పాప బర్త్ డే ఘనంగా నిర్వహించారు. వీడియోలో కెప్టెన్ పాపను ఎత్తుకుని సీట్ల మధ్యలోకి వచ్చాడు. అతను " లేడీస్ అండ్ జెంటిల్‌మన్ , నా పేరు అగస్టిన్.. అది ముఖ్యం కాదు, ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజు ఈ చిన్నారి మొదటి పుట్టినరోజు" అని చెప్పాడు. "ఈ చిన్నారి ఈ రోజుతో తన జీవితంలో మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. కేక్ కట్ చేసి ఇప్పుడు అందరికీ పంచిపెడుతుంది. మీరంతా ఈ పాపను ఆశీర్వదించండి" అని కూడా అనౌన్స్ చేశాడు. దీంతో విమానంలో ఉన్న వారు పాపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘటన జూన్ 22న జరిగింది. "మా యువరాణికి 22 జూన్ 2023న సంవత్సరం నిండింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ దీన్ని ప్రత్యేకంగా రూపొందించినందుకు చాలా కృతజ్ఞతలు " అని పాప తండ్రి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. "ఆజ్ ఏక్ సాల్ కీ హో గయీ హై దుర్గానాథ్, సో కేక్ భీ కటేగా, సబ్ మే బటేగా. ఆప్కీ ఆగే కి యాత్ర మంగళమే హో లేదా బచే కో ఆశీర్వాద దే. మీ ప్రయాణం బాగుండాలని కోరుకుంటున్నాను" ఓ నెటిజన్ కామెంట్ కూడా చేశాడు. "సో క్యూట్ అండ్ స్వీట్ ఇండిగో ఎయిర్‌లైన్స్, పుట్టినరోజు శుభాకాంక్షలు లిటిల్ ప్రిన్సెస్" అని మరొక యూజర్ రాశారు. "ఫ్లైట్‌లో ప్రత్యక్షంగా ఉన్న ఈ పాప వీడియోను చూసే అవకాశం నాకు లభించింది. కానీ మీరు వీడియోను అద్భుతంగా రూపొందించారు. తల్లిదండ్రులు మీ బిడ్డకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సురక్షితమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. సురక్షితమైన జీవితం ఉండాలని కోరుకుంటారు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు కామెంట్ చేశారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)