వారణాసిలో మోడీ టిఫిన్ పే చర్చా సమావేశం

Telugu Lo Computer
0


న్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై 7వతేదీన వారణాసి నగర పర్యటన సందర్భంగా మోడీ రూ.12,148 కోట్లతో 32 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశాక బీజేపీ కార్యకర్తలతో కలిసి టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధాని మోడీతో జరగబోయే కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు సొంతంగా టిఫిన్ తీసుకువస్తారని బీజేపీ నేతలు చెప్పారు. బీజేపీ కార్యకర్తలు మోడీతో కలిసి టిఫిన్ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఛాయ్ పే చర్చా కార్యక్రమం పెట్టగా ఈ సారి టిఫిన్ పే చర్చా కార్యక్రమం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాలని మోడీ నిర్ణయించారు. వారణాసి, జౌన్‌పూర్, ఘాజీపూర్, చందౌలీ, మిర్జాపూర్, భదోహి అనే ఆరు జిల్లాల నుంచి 14 వేల మంది వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులను మోడీ ర్యాలీకి ఆహ్వానించారు. వారణాసిలో మోడీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం, గ్రామీణ గృహనిర్మాణ పథకం, ఆయుష్మాన్ కార్డ్ స్కీమ్‌తో సహా ప్రతి మూడు పథకాల నుంచి ముగ్గురు లబ్ధిదారులకు మోడీ సర్టిఫికెట్లు అందజేయనున్నారు. ఈ మూడు స్కీమ్‌లలో ప్రతి 10 మంది లబ్ధిదారులతో కూడా ప్రధాని సంభాషించనున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)