రాజ్యసభ నుండి సస్పెండ్ కు గురై పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగిన ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎంపీలు సంపూర్ణ మద్దతు తెలిపి, ఆందోళనలో పాల్గొన్నారు. ఆప్ ఎంపీ ఆందోళనకు సంఘీభావంగా సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి బీఆర్ఎస్ ఎంపీలు ధర్నాలో కూర్చున్న సంగతి తెలిసిందే. పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు, లోక్ సభ లీడర్ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేయడాన్ని నామ తీవ్రంగా ఖండించారు. సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తి వేయాలని నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది అప్రజాస్వామికమని నామ అన్నారు. ధర్నాలో బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఎంపీ హోరెత్తించారు. https://t.me/offerbazaramzon
ఆప్ ఎంపీ ఆందోళనకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎంపీల ధర్నా!
July 25, 2023
0
Tags