ఢిల్లీలోని మంగోల్ పురి సమీపంలో ఓ ప్రేమ జంట బైక్ పై రోడ్డుపై ప్రయాణిస్తూ హల్ చల్ చేశారు. బైక్ రన్నింగ్ లో ఉండగానే ఆ యువతీ యువకుడిని కౌగిలించుకుని కిస్సులతో రచ్చ చేశారు. ఈ తతంగాన్నంత వారి వెనకాలే వస్తున్న ఓ కారులోని వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో దృష్యాలను ఘజియాబాద్ పోలీసులకు పంపించాడు. ఈ ఘటన జూలై 16న చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ ప్రేమ జంటకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించేలా వ్యవహరించిన లవర్స్ ను గుర్తించి వారికి రూ. 11000 జరిమానా వేశారు. అంతే కాకుండా పరిమితికి మించిన స్పీడు ఇంకా ఇతర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. https://t.me/offerbazaramzon
బహిరంగంగా రొమాన్స్ చేసిన లవర్స్ కి జరిమానా !
July 20, 2023
0