పంజాబ్ లోని గురుదాస్‌పుర్ జిల్లా డేరా బాబా నానక్ టౌన్‌కు చెందిన రూపీందర్‌జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. గత సంవత్సరం నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కూడా రూ.6 చొప్పున నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన 25 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. అనంతరం బ్యాంకులో తన పనిలో నిమగ్నమయ్యాడు. ఒక గంట సమయం తర్వాత.. 'మీరు రూ.కోటి గెలుచుకున్నారు' అని రూపీందర్‌జిత్‌కు లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఒక గంటలోనే కోటీశ్వరుడయ్యాడు. అయితే తన అలవాటే తనను ఇలా కోటీశ్వరుడిని చేసిందని రూపీందర్‌జిత్ తెలిపాడు. రూపీందర్‌జిత్ రూ.కోటి లాటరీ గెలవడం వల్ల బ్యాంకు సిబ్బంది అతడికి అభినందనలు తెలిపారు. కుటుంబసభ్యులు, బంధువులకు, స్నేహితులూ అభినందనలు తెలుపుతూ ఫోన్ కాల్స్ చేశారు. ఇదంతా చూస్తుంటే తన కల నిజమైనట్లు ఉందని రూపీందర్‌జిత్ అన్నాడు. తాను గెలిచిన రూ. కోటిని తన పిల్లలు, కుటుంబం భవిష్యత్ కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు. అవసరం ఉన్న పేద ప్రజలకు కూడా సహాయం చేస్తానని అన్నాడు. అయితే, రూపీందర్ లాటరీ బంపర్ ప్రైజ్ గెలవడం వల్ల డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగిపోయింది. https://t.me/offerbazaramzon
బ్యాంకు క్లర్క్‌కు జాక్‌పాట్ !
July 16, 2023
0
Tags