'వాట్సాప్‌ స్టేటస్‌' కూడా ఓ కమ్యూనికేషన్‌ వ్యవస్థే !

Telugu Lo Computer
0


'వాట్సాప్‌ స్టేటస్‌' ఓ రకమైన సమాచార వ్యాప్తివ్యవస్థేనని దీని ద్వారా సమాచారం వ్యాప్తి అవుతుందని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇతరులతో సంభాషించే సమయంలో సదరు యూజర్‌ బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ద్వేషపూరిత సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాడనే అభియోగాలతో ఓ వ్యక్తిపై నమోదైన కేసులో ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టులోని నాగ్‌పుర్‌ బెంచ్‌ పిటిషనర్‌ అభ్యర్థనను నిరాకరించింది. మహారాష్ట్రకు చెందిన కిశోర్‌ లాండ్కర్‌ అనే వ్యక్తి తన వాట్సాప్‌ స్టేటస్‌లో ఓ ప్రశ్న వేస్తూ అందుకు సమాధానాన్ని గూగుల్‌లో వెతకాలని పెట్టాడు. అందులో ఊహించని నిజాలు తెలుస్తాయని పేర్కొన్నాడు. అతడు చెప్పిన విధంగానే గూగుల్‌లో వెతికిన ఓ వ్యక్తికి అభ్యంతరకర వీడియోలు కనిపించాయి. అవి కొన్ని వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కిశోర్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చిలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. అయితే, తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కిశోర్‌ అక్కడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై నాగ్‌పుర్‌ బెంచ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. 'వాట్సాప్‌ స్టేటస్‌గా వీడియో, ఫొటో ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదైనా సమాచారాన్ని వారి కాంటాక్టులకు చేరవేసేందుకు వాట్సాప్‌ స్టేటస్‌ వాడుతున్నారు. ఇది కూడా ఒక విధమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థే' అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అటువంటప్పుడు ఇతరులతో కమ్యూనికేట్‌ చేసేటప్పుడు యూజర్లు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)