ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఏపీ స్టేట్ చీఫ్‌గా నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయనతో ఈ రోజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ''నడ్డాను కలిశాను. నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను. నాకిచ్చిన బాధ్యత విషయంలో నిబద్ధతతో పని చేస్తానని మాటిచ్చాను' అని పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీ, ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)