మూత్ర విసర్జన ఘటన బాధితుడి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌ లో ఆదివాసీ వ్యక్తి పై మూత్ర విసర్జన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు ప్రవేశ్ శుక్లాగా గుర్తించి ఈనెల 5న తెల్లవారు జామున అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం ప్రవేశ్ శుక్లా ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేయించారు. తాజాగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడు కాళ్లు కడిగి, క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని సీఎం చౌహాన్ భోపాల్ లోని తన నివాసానికి గురువారం పిలిపించారు. స్వయంగా బాధితుడికి ఎదురెళ్లి తన నివాసంలోకి స్వాగతం పలికారు. అనంతరం అతన్ని కూర్చీపై కూర్చోబెట్టి సీఎం స్వయంగా బాధితుడి కాళ్లు కడిగి, క్షమాపణలు చెప్పారు. అనంతరం సీఎం చౌహాన్ మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించిన వీడియో నన్నెంతో బాధిందించింది. ఈ విషయమై క్షమాపణలు కోరుతున్నా. ప్రజలే నాకు దేవుడితో సమానం అని బాధితుడితో సీఎం తెలిపారు. ఈ తరహా దుశ్చర్యలను సహించేది లేదని, రాష్ట్రంలోని ప్రతిపౌరుడి గౌరవం తన గౌరవమేనని పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)