లిఫ్ట్​లో చిక్కుకుపోయిన వారిని రక్షించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది

Telugu Lo Computer
0


ఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని క్లబ్ లిఫ్ట్‌లో పది గంటలపాటు చిక్కుకుపోయిన పది మంది వ్యక్తులను అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం జులై 16 ఉదయం 6.40 గంటలకు సౌత్ ఎక్స్‌లోని క్లబ్ లిఫ్ట్‌లో కొంతమంది ఇరుక్కుపోయారని అగ్నిమాపక విభాగానికి కాల్ వచ్చింది. ఆ శాఖ వెంటనే ఫైర్ ఇంజన్లు.. రెస్క్యూ టెండర్ బృందాలను సంఘటనా స్థలానికి తరలించింది. రెస్క్యూ అధికారులు భవనం కిటికీ అద్దాలను పగలగొట్టి లోపల చిక్కుకున్న పది మందిని రక్షించారు. వారిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. "క్లబ్ నుండి వస్తున్న సుమారు 10 మంది వ్యక్తులు లిఫ్ట్‌లో చిక్కుకుపోయినట్లు సౌత్ ఎక్స్ నుండి కాల్ వచ్చింది" అని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ ఒక ట్వీట్‌లో తెలిపారు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)