అస్సాంలోని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్‌లో జూన్ 21న బాల్య వివాహం కేసులో ఒక మైనర్ బాలికను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి బాలిక పారిపోయిందని ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆ ఇద్దరిని వెతికి పట్టుకున్నారు. ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఆ యువతికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి, ఆమెపైనే కన్నేశాడు. దుస్తులు తీయించి, అభ్యంతరకరమైన ఫోటోలు తీశాడు. దీంతో ఆ బాలిక.. ఆ పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేసింది. 'నన్ను స్టేషన్‌లోనే ఆ అధికారి బెదిరించాడు. బట్టలు తొలగించమని, నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బలవంతంగా నా ఫోటోలు తీశాడు'' అని ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సంచలనంగా మారడంతో.. అస్సాం డీజీపీ జీపీ సింగ్ ఈ కేసుపై రియాక్ట్ అయ్యారు. అస్సాంలోని నల్బరీ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జూన్ 21న 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిందని.. అయితే ఆమె పట్ల సబ్ ఇన్‌స్పెక్టర్ బిమన్ రాయ్ అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేశాడని డీజీపీ జీపీ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, వెంటనే ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశామన్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుంటామని అన్నారు. ఎవరైనా అతని గురించి సమాచారం అందిస్తే తగిన రివార్డ్ కూడా ఉంటుందన్నారు. https://t.me/offerbazaramzon
పోలీస్ స్టేషన్‌లో ఎస్సై వికృత చేష్టలు !
July 02, 2023
0
Tags