వందే భారత్ రైలును ఓ పాత ఎలక్ట్రిక్ ఇంజిన్ లాగుతున్న 25 సెకన్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్లిప్పింగ్‌ను చాలా మంది షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కృష్ణ సైతం ఈ వీడియోను షేర్ చేస్తూ '9 ఏళ్ల అబద్ధాలను 70 ఏళ్ల చరిత్ర లాక్కెళుతోంది' అంటూ ఓ వ్యాఖ్యను జోడించారు. మరికొందరు సైతం 'హైస్పీడ్ రైళ్లంటూ ఊదరగొట్టారు. చివరికి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఇంజిన్లే దిక్కయ్యాయంటూ' మరికొందరు సైతం ట్వీట్ చేశారు. దీంతో వాస్తవమేంటో తెలీని కొందరు సైతం నిజమేననుకుంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై ఈస్ట్ సెంట్రల్ రైల్వే స్పందించింది.
అది ఇంకా ప్రారంభానికి నోచుకోని వందే భారత్ రైలు అని తెలిపింది. రూట్ కూడా ఖరారు కాలేదని, ఒకసారి రూట్ ఖరారు అయ్యాకనే లోకో పైలట్లు, సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపింది. వాస్తవానికి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శశంక్ జైశ్వాల్ అనే వ్యక్తి సకల్ దిహా రైల్వేస్టేషన్ సమీపంలో ఇటీవల ఈ వీడియోను రికార్డు చేశాడట. చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి పట్నా తరలిస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. అందులో ప్రయాణికులు గానీ, సిబ్బంది గానీ లేరని పేర్కొన్నప్పటికీ కేవలం వీడియోను మాత్రమే డౌన్‌లోడ్ చేసి కొందరు తమదైన కామెంట్లు జోడించడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. https://t.me/offerbazaramzon