ట్రాఫిక్‌ పోలీస్‌పై వ్యక్తి దాడి !

Telugu Lo Computer
0


ర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు బెంగళూరులోని బనసవాడి ప్రాంతంలో నో పార్కింగ్‌ జోన్‌లో ఒక కారు నిలిచి ఉంది. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఉమేష్ దీని గురించి వాహనదారుడ్ని నిలదీశాడు. చలానా కూడా జారీ చేశాడు. కాగా, మహిళా రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పాడు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీస్‌, కారు యజమాని మధ్య ఘర్షణ జరిగింది. ఇంతలో కారు నుంచి దిగిన మహిళా రోగి తోపులాటలో రోడ్డుపై పడింది. దీంతో ఆగ్రహించిన కారు యజమాని, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మీదకు దూసుకెళ్లి అతడ్ని కొట్టాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతా వారు ఇరువురికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మరోవైపు, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి చేయడాన్ని కొందరు తమ మొబైల్‌ ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. ఈ గొడవకు కారణమైన కారు యజమాని కమ్రాన్ షాహిద్ అలియాస్ సులేమాన్ వీకేను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం, విధులకు ఆటంకం కలిగించడం వంటివి చేసే వారిపై కఠిన చర్యలు చేపడతామని బెంగళూరు పోలీసులు హెచ్చరించారు. మరోవైపు ట్రాఫిక్‌ పోలీస్‌పై దాడికి సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)