నన్ను కాపాడిన అబ్దుల్‌ను కలిశా !

Telugu Lo Computer
0

                                               

హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియాకు వెళ్లే మార్గంలో హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయిన సంగతి తెలిసిందే.  ఈ ప్రమాదంలో తేజ్‌ ఛాతీతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే అదే మార్గంలో వస్తున్న మెగా మేనల్లుడిని షాహిద్‌ ఫర్హాన్‌ అనే యువకుడు కాపాడాడు. రోడ్డు పక్కన తేజ్‌ను కూర్చొబెట్టి వెంటనే అంబులెన్స్‌కు కాల్‌ చేసి ఆస్పత్రికి తరలించాడు. ఫర్హాన్‌ అబ్దుల్‌ సత్వరమే స్పందించడంతో తేజ్‌కు ప్రాణాపాయం తప్పింది. అయితే సకాలంలో స్పందించి సాయం చేసిన అబ్దుల్‌కు ఎలాంటి సాయం అందలేదని ఆ మధ్యన పుట్టుకొచ్చాయి. ఫర్హాన్‌ సైతం ఈ విషయంపై మాట్లాడుతూ.. తేజ్‌ నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదన్నాడు. తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించాడు సుప్రీం హీరో. తన లేటెస్ట్‌ బ్రో ప్రమోషన్లలో పాల్గొన్న తేజ్‌ ఇటీవలే అబ్దుల్‌ను కలిశానని చెప్పుకొచ్చాడు. అలాగే అతనికి ఎప్పుడు, ఏ అవసరమొచ్చినా అండగా ఉంటానన్నాడు. 'ఈ విషయంపై కొందరు సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్నారు. నాకు సాయం చేసిన అబ్దుల్‌కి కొన్ని డబ్బులిచ్చి చేతులు దులుపుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే అతను నా ప్రాణాలను కాపాడాడు. నేను అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని చెప్పాను. ఈమధ్య కూడా అబ్దుల్‌ను కలిశాను. నాతో పాటు నా టీం అతనికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది' అని తెలిపాడు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)