రాజస్తాన్ లో కొద్ది రోజుల క్రితం సుధా చౌదరి అనే మహిళ తన కుమారుడితో కలిసి స్కూటీపై వెళుతుండగా దుండగులు వెంబడించి ఆమెను కాల్చి చంపారు. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె సమీప బంధువే సుధా చౌదరిని హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడు మనోజ్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. వివరాల్లోకి వెళితే సుధా చౌదరి భర్త పుష్పేంద్ర సింగ్ సీఆర్ఫీఎఫ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అతడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుశీలా దేవీ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మొదటి భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే 2022లో పుష్పేంద్ర సింగ్ మరణించాడు. మరణానంతరం వచ్చే భర్త ఉద్యోగం కోసం ఇద్దరు భార్యలు వివాదానికి దిగారు. కారుణ్య నియామకం తనకు వర్తిస్తుందని ఇద్దరూ కొట్టుకోవడం మొదలు పెట్టారు. అతడు తన భర్త అంటే తన భర్త అని పోట్లాడుకున్నారు. ఈ సమయంలో మనోజ్ సింగ్, పుష్పేంద్ర రెండో భార్యకు మద్దతు ఇవ్వడం మొదలు పెట్టాడు. సుధా చౌదరిని అంతమొందించేందుకు ప్రణాళిక రచించాడు. గత నెలలో భరత్‌పూర్ జిల్లాలోని నాద్‌బాయి పట్టణంలో స్కూటీపై వెళ్తున్న సుధాను పట్టపగలు బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వెనుక నుంచి కాల్చి చంపారు. అనంతరం అక్కడ నుండి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి. నిందితుడు మనోజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. https://t.me/offerbazaramzon
భర్త ఉద్యోగం కోసం భార్యల మధ్య జగడం !
July 10, 2023
0
Tags