మణిపూర్‌ ఘటనపై అట్టుడికిన రాజ్యసభ

Telugu Lo Computer
0


పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. ఇటీవల మృతి చెందిన సిట్టింగ్‌ సభ్యులు, మాజీలకు సభలు సంతాపం ప్రకటించాయి. అనంతరం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ తిరిగి మొదలవ్వగా మణిపూర్‌ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. సభలో ఇతర కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసి అంశంపైనే చర్చ జరపాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ సభకు వచ్చి ఘటనపై సమాధానం చెప్పాలన్నారు. సభ్యులు సంయమనం పాటించాలని ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ కోరారు. అయినప్పటికీ విపక్ష నేతలు నినాదాలు చేయడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టబోమని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)