మణిపూర్‌లో హింస ఆగడం లేదు. తాజాగా బుధవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.రెండు ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు వివరించారు. మంగళవారం రాత్రి తొలి ఖోయిజుంతాబి ప్రాంతంలో కాల్పులు జరగగా, బుధవారం తెల్లవారు జామున 4.30 సమయంలో తూర్పు ఫైలెంగ్ ప్రాంతంలో జరిగింది. ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. మణిపూర్‌లోని చాలా పోస్టుల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 118 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 326 మందిని అరెస్టు చేశారు. నిన్న అల్లరి మూకలు భారీగా ఆయుధ లూటీకి పాల్పడేందుకు విఫలయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ధౌబాల్ జిల్లాలో ఇండియన్ రిజర్వు బెటాలియన్ వద్ద ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు అల్లరి మూకలు ప్రయత్నించాయి. వీటిని భద్రతా దళాలు అడ్డుకొన్నాయి. వందల సంఖ్యలో అల్లరి మూకలు ఐఆర్బీ బెటాలియన్ పోస్టుపై దాడి చేశాయి. ఐఆర్‌బీ దళాలకు మద్దతుగా సైన్యం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇతర దళాలు రాకుండా అల్లరి మూకలు రహదారులను ముందే తవ్వేశాయి. కానీ, అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ముప్పు తప్పింది. వీరు అల్లరి మూకలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. https://t.me/offerbazaramzon
మణిపూర్‌లో కొనసాగుతున్న హింస !
July 05, 2023
0
Tags