ఓ కుక్కకు సీమంతం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఇంటిల్లిపాది చుట్టుపక్కల మహిళలు అంతా కలిసి కుక్కకు సీమంతం చేశారు. శునకం సీమంతానికి పండ్లు, పూలు కూడా పెట్టారు. దాని కోసం ఓ చీరను కొనుక్కొచ్చి కట్టారు. బొట్టు పెట్టి హారతి కూడా పట్టారు. కుక్క సీమంతం చేస్తుండగా అక్కడే ఉన్న వారు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళలకు సీమంతం ఎలా చేస్తారో అలానే కుక్క సీమంతం చేసి దాని ఉన్న ప్రేమను చాటుకున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో.. ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోపై నెటిజన్లు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. వారికి కుక్కలంటే ఎంత ప్రేమో అని ఒకరు కామెంట్ చేయగా.. వైరల్ అవడం కోసమే ఇలా చేశారని మరొకరు కామెంట్ చేశారు. https://t.me/offerbazaramzon
కుక్కకు సీమంతం !
July 29, 2023
0
Tags