రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. అనుకున్న సమయానికి విమానం టేకాఫ్ తీసుకుంది. కానీ కొద్దిసేపటికే విమానంలో ఓ ప్రయాణీకుడు తన మొబైల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టుకోగా అదికాస్తా వేడెక్కింది. ఎంత వేడెక్కిందంటే పొగలు వచ్చేంతగా దీంతో ఆ విషయాన్ని విమాన సిబ్బంది పైలట్ కు చెప్పటంతో ఆ మొబైల్ ఏ సమయంలోనే పేలిపోతుందనే ఆందోళనతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. కానీ అప్పటికే విమానంలో పొగ కమ్మేసింది. విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్ తో పెను ప్రమాదం తప్పినట్లుగా భావిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రయాణీకులతో పాటు సిబ్బంది అంతా సేఫ్ గా ఉన్నారని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ల్యాండ్ అయిన విమానాన్ని టెక్నికల్ సిబ్బంది పూర్తిగా తనిఖీలు నిర్వహించిన గంట తరువాత విమానం తిరిగి బయలుదేరింది. ఎయిర్ ఇండియా విమానంలో 140 మంది ప్రయాణీకులతో పాటు సిబ్బంది ఉన్నారు. https://t.me/offerbazaramzon
మొబైల్ ఫోన్ లో పొగలు - విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
July 18, 2023
0
Tags