'కైలాస' దేశ ప్రధానిగా నటి రంజిత ?

Telugu Lo Computer
0


దేశం నుంచి పారిపోయిన స్వామి నిత్యానంద.. తనకంటూ ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించుకున్నాడు. దానికి యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు పెట్టుకున్నాడు. తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ఆ దేశ ప్రధానిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఓ తమిళ న్యూస్ పేపర్ వెల్లడించింది. ఈ మేరకు నిత్యానంద  తన వెబ్ సైట్ లోనూ ప్రకటించాడు. రంజిత ఫొటో అప్ లోడ్ చేసి దాని కింద ఆమెను 'నిత్యానందమయ స్వామి' అని పేర్కొన్నాడు. అంతేకాకుండా హిందువుల కోసం ఏర్పాటైన ఆ దేశ ప్రధానిగా రంజితను నియమిస్తున్నట్లు పేర్కొన్నాడు. పలు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించిన రంజిత నాటి తరానికి సుపరిచితం. ఇటీవల కౌలాస దేశం తరపున ఐక్యరాజ్య సమితి సమావేశంలో మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)