నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటుపై సంజయ్ రౌత్ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తిరుగుబాటును ప్రజలు సహించరని మండిపడ్డారు. ఎన్‌సిపిలో చీలక గురించి తాను ఇప్పుడే శరద్ పవార్ తో మాట్లాడానని ఉద్ధవ్ థాకరే వర్గం నేత, ఎంపి సంజయ్ రౌత్ అన్నారు. కొందరు మహారాష్ట్ర రాజకీయాలను నాశనం చేసే పనిని చేపట్టారని, వారు ఎంచుకున్న మార్గంలోనే వారిని ముందుకు వెళ్లనివ్వాలని పరోక్షంగా అజిత్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే, బిజెపి నుద్దేశించి అన్నారు. తాను ఇప్పుడే శరద్ పవార్ తో మాట్లాడానని అన్నారు. '' నేను బలంగా ఉన్నాను. ప్రజల మద్దతు మాకు ఉంది. ఉద్ధవ్ ధాకరేతో కలిసి మళ్లీ అన్నింటిని పునర్నిర్మిస్తానని శరద్ పవార్ చెప్పారు'' అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. పార్టీలో నిలువునా చీలికలు సృష్టించే, ఇటువంటి సర్కస్ ఫీట్లను మహారాష్ట్ర ప్రజలు ఎక్కువ కాలం సహించరని అన్నారు. అజిత్ పవార్ ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ కు షాక్ ఇస్తూ.. షిండే-ఫడ్నవీస్ (ఎన్‌డిఎ) ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్‌సిపికి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట నిలిచారు. అజిత్ పవార్ ఆదివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, మరో 9 మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. https://t.me/offerbazaramzon
ఈ తిరుగుబాటును ప్రజలు సహించరు !
July 02, 2023
0
Tags