కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు సహా ఎంపీలు సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ లు కలిశారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు వరదలకు గురయ్యాయని.. ముఖ్యంగా ఉత్తరాదిలో వర్షాలు, వరదలతో అతలాకుతలమైందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు బీఆర్ఎస్ ఎంపీలు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడిన క్రమంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడువును మరో నెల పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. https://t.me/offerbazaramzon
నిర్మలా సీతారామన్ ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలు
July 25, 2023
0
Tags