రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకొచ్చింది. క్రమంగా వీటిని దేశ వ్యాప్తంగా విస్తరిస్తూ ప్రజలకు సేవలను పరిచయం చేస్తోంది. ఇటీవలే ఐదు రూట్లలో ప్రధాని మోదీ వందేభారత్ రైళ్లను ప్రారంభించగా తాజాగా మరో రెండు రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. రేపు విజయవాడ- చెన్నై మధ్య వందేభారత్ రైలును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి చెన్నైకి కేవలం ఆరున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రూట్‌లో 3 స్టాపులను ఏర్పాటు చేశారు. ఏపీలోని గూడూరు, రేణిగుంట స్టేషన్ల వద్ద, తమిళనాడులోని కడ్‌పట్ స్టేషన్ వద్ద వందేభారత్ రైలు ఆగుతుంది. చెన్నై నుంచి విజయవాడకు వచ్చే రైలు కూడా ఈ స్టాపుల్లోనే ఆగనుంది. తమిళనాడుకు కూడా ఇది మూడో వందేభారత్ రైలు కానుంది.విజయవాడ నుంచి చెన్నైకు కేవలం ఆరున్నర గంటల్లోనే వెళ్లిపోవచ్చు. ఇక ఏసీ చైర్ క్లాస్ టికెట్ ధర రూ. 1000-1200 మధ్య ఉండొచ్చని.. అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ రేట్లు రూ. 1500-1700 మధ్య ఉంటాయని తెలుస్తోంది. https://t.me/offerbazaramzon
ఆరున్నర గంటల్లోనే విజయవాడ టు చెన్నై !
July 06, 2023
0
Tags