ప్రేయసిని పూడ్చిపెట్టిన ప్రేమోన్మాది !

Telugu Lo Computer
0


ఆస్ట్రేలియాలో భారత్‌కు చెందిన జాస్మిన్‌ కౌర్‌ (21) నర్సింగ్‌ చదువుకునేందుకు వెళ్లింది. అక్కడే తారిక్‌జోత్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే.. తారిక్‌ ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె.. అతన్ని దూరం పెడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్నాడు. అడిలైడ్‌లో ఆమె పని చేసే చోట నుంచే కిడ్నాప్‌ చేశాడు తారిక్‌. కారులో ఆమెను బంధించి.. నాలుగు గంటలపాటు ప్రయాణించి ఫ్లిండర్స్‌ రేంజ్స్‌ చేరుకున్నాడు. అక్కడే ఘోరానికి పాల్పడ్డాడు. ఆమె కళ్లకు గంతలు కట్టి.. కాళ్లు చేతుల్ని కేబుల్స్‌తో కట్టేసి.. సమాధి చేశాడు. మార్చి 2021లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఆమె మిస్సింగ్‌ కేసు నమోదుకాగా.. కొన్ని నెలలకు ఆమె హత్యకు గురైందన్న విషయం బయటపడింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అతనే దోషిగా తేలింది. ఈ మేరకు బుధవారం వాదనలు విన్న స్థానిక కోర్టు.. అతనిది ప్రతీకారచర్యగా తేల్చడంతో పాటు జీవిత ఖైదు శిక్ష పడొచ్చని తేల్చి చెప్పింది. మనిషిలో మృగస్వభావం ఏమేర ఉంటుందనేది తారిక్‌ను చూసి తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించింది. తాను చేసిన పొరపాటల్లా.. తన కూతురిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపడమేనని, ఆ తర్వాత మళ్లీ తన కూతురిని కళ్లారా చూసుకోలేకపోయానని విలపిస్తోంది జాస్మిన్‌​కౌర్‌ తల్లి. వందసార్లు తిరస్కరించినా కూడా తన కూతురి వెంటపడడం తారిక్‌జోత్ సింగ్ ఆపలేదని.. అతని నేరానికి క్షమాపణే ఉండకూదని కోరుకుంటోందామె. జాస్మిన్‌ను ఎక్కడైతే ఆ ప్రేమోన్మాది పూడ్చిపెట్టి హత్య చేశాడో అక్కడే ఆమెకు సమాధి కట్టి ప్రార్థనల ద్వారా ఆ కుటుంబం నివాళులర్పిస్తూ వస్తోంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)