యూఎస్ నేవీ చీఫ్ గా అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టి నియామకం !

Telugu Lo Computer
0


మొట్ట మొదటిసారి ఒక మహిళను యూఎస్ నేవీ చీఫ్ గా అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టిని నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. లిసా ఫ్రాంచెట్టి గతంలో ఒక గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్, డిస్ట్రాయర్ స్క్వాడ్రన్, రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులకు కమాండ్ అధికారిణిగా పనిచేశారు. ఫ్రాంచెట్టి వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ పాత్రతో సహా కమీషన్డ్ అధికారిణిగా అమెరికా దేశానికి 38 సంవత్సరాలపాటు అంకితభావంతో పనిచేసిందని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ నేవీలో ఫోర్-స్టార్ అడ్మిరల్ ర్యాంక్ సాధించిన రెండవ మహిళ ఈమె. లిసా మళ్లీ నావల్ ఆపరేషన్స్ చీఫ్‌గా , జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లో పనిచేసిన మొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తుందని జోబిడెన్ పేర్కొన్నారు. అడ్మిరల్ మైక్ గిల్డే నావికాదళ అధిపతిగా నాలుగు సంవత్సరాల పదవీకాలాన్ని వచ్చే నెలలో పూర్తి చేసుకోనున్నారు. అనంతరం ఫ్రాంచెట్టి నేవీ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)