మణిపూర్ లో సభ్యసమాజం తల వంచుకునేలా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరించిన ఘటనపై నిరసనలు పెల్లుబుకుతుండగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి మోడీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిలదీశారు. ఈ ఘటన మీ హృదయాన్ని కొంచెమైనా బాధించలేదా అని ప్రశ్నించారు. శుక్రవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌ను వేలెత్తి చూపుతున్న ప్రధానికి తల్లులు, చెల్లెళ్ల మీద ఎలాంటి ప్రేమలేకుండా పోయిందన్నారు. ఆడ కూతుళ్లను తగులబెడుతున్నంత వరకూ, దళితులు, మైనారిటీలపై హత్యలు కొనసాగుతున్నంత కాలం మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల్లో తమ ఆడ కూతుళ్ల కోసం ప్రశ్నించడం మానేది లేదని ఆమె స్పష్టం చేశారు. వారికి న్యాయం జరిగేంత వరకూ విశ్రమించేందుకు లేదన్నారు. ఆడ కూతుళ్లను రక్షించండి (బేటీ బచావ్) అంటూ బీజేపీ నినాదం ఇస్తుంటుందని, ఇప్పుడు ఆ నినాదం ఏమైందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. మణిపూర్ ప్రజలకు తాము సంఘీభావం తెలుపుతున్నట్టు చెప్పారు. ఈరోజు మణిపూర్ తగులబడుతోందని, యావద్దేశం మంటల్లో ఉందని ఉన్నారు. బిల్కిస్ బానో కేసులో నిందితులను బెయిలుపై విడుదల చేశారని, రెజ్లర్ (బ్రిజ్ భూషణ్ కేసు) కేసులో బెయిల్ మంజూరు చేశారని, రాబోయే ఎన్నికల్లో మహిళలను దేశ రాజకీయాలకు దూరం చేయాలని అనుకుంటున్నారని బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు. https://t.me/offerbazaramzon
మోడీకి చీమకుట్టినట్లుగా కూడా లేదు
July 21, 2023
0
Tags