కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో మరో మగ చిరుత మృతి చెందింది. గత నాలుగు నెలల కాలంలో నమీబియా నుంచి భారత్ కు తెచ్చిన చీతాలలో ఇది ఏడో మరణం. గాయపడిన మగ చిరుత తేజస్ కు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. చికిత్స పొందుతూ తేజస్ ప్రాణాలు విడిచింది. అంతకుముందు కొన్ని గంటలపాటు అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా చనిపోయిన చిరుతతో కలిపి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 4 చిరుతలు, 3 చిరుత పిల్లలు మరణించాయి. దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి దేశానికి తీసుకొచ్చిన చిరుతలలో మగ చిరుత తేజస్ కూడా ఉంది. మే 25న కునో పార్క్‌లో 2 చిరుత పిల్లలు చనిపోయాయి. ఇప్పుడు మగ చిరుత తేజస్‌ చనిపోవడంతో ఆఫ్రికా దేశాల నుంచి దేశానికి తరలించిన వాటిలో చనిపోయిన చిరుతల సంఖ్య 7కు చేరింది. అనారోగ్య, ప్రతికూల వాతావరణం సహా ఇతర కారణాలతో ఆడ, మగ కలిపి నాలుగు పెద్ద చిరుతలు, మూడు చిరుత పిల్లలు చనిపోయాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)